calender_icon.png 29 September, 2024 | 8:54 PM

విద్య, వైద్యంపై సీఎం ప్రత్యేక దృష్టి

05-09-2024 02:16:03 PM

సమిష్టి కృషితో సకలం సక్సెస్ 

తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు దైవంతో సమానం 

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల, (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని, సమిష్టి కృషితో తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు దైవంతో సమానంగా కీర్తించబడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గురువారం సందర్శించి పిల్లల, కంటి వార్డును పరిశీలించారు. ఇందులో భాగంగా జగిత్యాల మండలానికి చెందిన మహిళ ప్రసూతి సమయంలో అనారో గ్యంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ సంబంధిత వైద్యులు, సిబ్బంది మెరుగైన శస్త్ర చికిత్సచేసి తల్లి పిల్ల ప్రాణాలు కాపాడగా,పిల్లల వార్డులో శిశువును పరిశీలించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని వైద్యులు, సిబ్బంది సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ అభినందించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయంపై ముఖ్యమంత్రి  ప్రత్యేక శ్రద్ధ సారించారన్నారు. జగిత్యాల మెడికల్ హబ్ గా మారబోతుందని తెలిపారు.

జగిత్యాల మండలానికి చెందిన గర్భిణీ అనారోగ్యంతో బాధపడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ప్రసూతి చేసి వైద్యులు, సిబ్బం ది తల్లి బిడ్డను రక్షించారన్నా రు. వెంటిలేటర్ పై ఉన్న తల్లి ఆరోగ్యం బాగుందని,1 కేజీ 500గ్రాము పాప జన్మించింది, ఇద్దరి ఆరోగ్యం బాగుందని, పాపకు ఆక్సీజన్,ఫ్లుయిడ్స్ ఇస్తున్నారని వెల్లడించారు. తల్లి పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బందిని దైవంతో సమానంగా కొలుస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందున బెడ్లు సరిపోని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కాసేపు మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల నియామకంపై డిఏంఇతో ఫోన్ లో మాట్లాడగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. 

రూ.10 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ను సైతం ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు.ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని వైద్యులు, సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు.ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాములు, హెఓడి అరుణ, ఆర్ఎంఓ యాకూబ్ పాషా, డాక్టర్ గీతిక, మున్సిపల్ కౌన్సిలర్ కూసరి అనిల్, నాయకులు బోనగిరి నారాయణ, భూపెల్లి శ్రీనివాస్, శేఖర్,వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.