calender_icon.png 5 November, 2024 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ దుస్థితిపై హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు

02-08-2024 08:29:09 PM

హైదరాబాద్: హైడ్రాకు సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పాలకులు ఎవరున్నా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని, రాజకీయ విభేదాలు ఉన్నాప్పటికీ అభివృద్ధి విషయంలో రాజీ పడలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దానం నాగేందర్ రెడ్డికి హైదరాబాద్ లోని ప్రతీ గల్లీ తెలుసాన్నారు. ఎంతో అధ్యయనం తర్వాత హైడ్రాను ఏర్పాటు చేశామని, హైడ్రా పరిధిని 2 వేల కిలోమీటర్లు విస్తరించామన్నారు. హైదరాబాద్ లో సరస్సుల మాయం అవుతున్నాయని, హైదరాబాద్ దుస్థితిపై హైకోర్టు కూడా తీవ్రవ్యాఖ్యలు చేసిందని సభ ముఖంగా రేవంత్ రెడ్డి తెలిపారు.

నాలాల కబ్జాలతో నగరం అతలాకుతలం అవుతోందని, గత ప్రభుత్వం అవసరానికి తగినట్లు వ్యవస్థలను మార్చలేదని, గత పాలకులు అద్దాల మేడలే అభివృద్ధి అని చూపారని దుయ్యబట్టారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తీసుకోచామని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు చేసిన ఆలోచనలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. వైఎస్ఆర్ ఓఆర్ఆర్ ను నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్ఆర్ ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని ఎద్దెవా చేశారు. హైదరాబాద్ ను ప్రణాళికకు విరుద్ధంగా అభివృద్ధి చేశారని, వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్లపై చుక్కనీరు నిలవకుండా ప్రణాళకలు ఉన్నాయని సీఎం రెడ్డి వెల్లడించారు.