- బీఆర్‌ఎస్ శ్రేణుల డిమాండ్
- సబితాఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు
ముషీరాబాద్, ఆగస్టు1: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం లేదని మండిపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ఆందోళనకారులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జైసింహతో పాటు తదిత రులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడవెళ్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జాతీయ రహదారిపై నిర్వహించిన ఆందోళనలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి: భువనగిరిలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిం చారు. ఆందోళనలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు సీఎం చిత్రపటాన్ని దహనం చేశారు.
గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు రాజీవ్ రహదారిపై వంటిమామిడి ఏఎంసీ మాజీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జుబేర్‌పాషా ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మెదక్: మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెల్ల మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
వికారాబాద్ రూరల్: బీఆర్‌ఎస్ వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
చేవెళ్ల: బీఆర్‌ఎస్ నాయకులు చేవెళ్ల, శంకర్‌పల్లిలో ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ పటోళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.