calender_icon.png 12 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

02-08-2024 12:05:00 AM

  1. బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్ 
  2. మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఫైర్ 
  3. అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నిరసనలు 
  4. రేవంత్, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 1: శాసనసభలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించి, వారి శోకానికి కారణ మైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లో గురువారం సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడు తూ.. మహిళా ఎమ్మెల్యేల శోకానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుతం పతనం తప్పదని మండిపడ్డారు.

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం తన స్థాయిని మరిచి, మహిళా ఎమ్మెల్యేల పట్ల నీచంగా మాట్లాడటం దుర్మార్గం అని ధజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తున్నదని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగనందునే వారిని అసెంబ్లీలో అవమానపరిచారని ఆరోపించారు. సీఎం రేవంత్‌కు మహిళలపై, ప్రజాసామ్యంపై గౌరవం లేదని ఈ ఘటనతో స్పష్టమైందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

హుజూరాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం

హుజూరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధికశ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్య లు చేయడం సిగ్గుచేటన్నారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ రాణి, సురేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు గొడిశాల పావనిగౌడ్, కౌన్సిలర్లు ప్రతాప తిరు మల్‌రెడ్డి, అపరాధ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, మక్కపల్లి కుమార్, మక్క రమేశ్, కల్లెపెల్లి రమాదేవి, మారపెల్లి సుశీల, ఎండీ ఇమ్రాన్, ప్రతాప కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.