calender_icon.png 9 October, 2024 | 8:49 PM

బీఆర్ఎస్ అధికారం రాదు.. ప్రజలు ఇవ్వరు

09-10-2024 06:22:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారుబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీఎస్సీ విజేతల సంతోషాన్ని చూసి.. కొందరు కళ్లల్లో కారం పెట్టుకుంటున్నారని, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోగానే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, పేదల గురించి ఆలోచించలేదు కానీ.. కుతూరికి మాత్రం 6 నెలల్లో ఎమ్మెల్సీ ఇచ్చారని సీఎం ఎద్దేవా చేశారు. తము అధికారంలోకి వచ్చాక పేదల మేలు కోసం విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తున్నామని, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ సమాజం మీద బీఆర్ఎస్ కు ఎందుకంత కోపం..? అని ప్రశ్నించారు. 7 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు పోయాయి.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోచ్చారు. తమ ప్రభుత్వాన్ని పడగొడగామని బీఆర్ఎస్ అంటుందని, బీఆర్ఎస్ అధికారం రాదు.. ప్రజలు ఇవ్వరు, టీచర్లే తెలంగాణ వారధులు.. నిర్మాతలు. పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చే బాధ్యత టీచర్లదే అని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో 34 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లకంటే అనుభవజ్ఞులు ఉన్నారా..? అని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామన్నారు. ఈ నెల 11న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యకు బడ్జెట్ లో రూ.25 వేల కోట్లు కేటాయించామన్నారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరిస్తున్నామని, విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తామని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. స్కిల్ వర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందిస్తున్నాం. ఒలింపిక్స్ లో దేశం పరిస్థితి ఏంటో చూశాం.. ఒలింపిక్స్ లో 4 కోట్లు జనాభా ఉన్న దక్షిణ కొరియాకు 32 పతకాలు, 140 కోట్లు జనాభా ఉన్న భారత్ కు ఎందుకు పతకాలు రాలేదు..? తెలంగాణ యువత మత్తుకు, వ్యసనాలకు బానిసలు అయ్యి.. యువత తప్పుదోవ పడుతున్నారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లకు బంగారు పతకాలు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.