హైదరాబాద్,(విజయక్రాంతి): ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నూతనంగా రిక్రూట్ అయిన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటైనా కట్టిందా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్ కట్టలేదు కానీ, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం 10 ఎకారాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
2011లో రాష్ట్రంలో చివరిసారిగా గ్రూఫ్-1 నిర్వహించారు. తర్వాత దాదాపు 13 ఏళ్లపాటు గ్రూప్-1 నిర్వహించలేదన్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా.. పట్టుబట్టి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామన్నారు.త్వరలోనే గ్రూప-1 నియామకపత్రాలను కూడా అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నేత బాధ్యత కానీ, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బడి దొంగలను చూశాం కానీ, అసెంబ్లీకిరాని వాళ్లను ఇక్కడే చూస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యాబట్టారు.