calender_icon.png 29 March, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

26-03-2025 03:19:06 PM

ఆన్ లైన్ బెట్టింగ్ ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవు

హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్(Online betting) అనేది అంతర్జాతీయస్థాయి నేరంగా మారిందని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించిందన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. వీటిని నిరోధించడానికి, నిషేధించడాని సిట్ వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మ నేరాలకు శిక్షలను కూడా సవరించుకోవాల్సి ఉందన్నారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మకి ప్రచారం కల్పించినవారిని విచారించామని తెలిపారు.

ప్రచారం కల్పించినవారిని విచారించడంతోనే సమస్య పరిష్కారం కాదని ముఖ్యమంత్రి తెలిపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(Special Investigation Team) ఏర్పాటు చేసి వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్న చర్యలు తప్పవని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శాంతిభద్రతలపై కూడా విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో శాంతిభద్రతల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అందరికీ తెలుసన్నారు. దిశ ఘటన, న్యాయవాద దంపతుల హత్య ఘటనలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణలన్నారు. న్యాయవాద దంపతులను నడి బజార్ లో నరికి చంపితే ఇప్పటికీ శిక్షలు పడలేదని సీఎం ఆరోపించారు. సింగరేణి కాలనీ(Singareni Colony)లో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఉదంతంలో ఆనాడు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మహిళలపై దాడుల్లో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు.

జూబ్లీహిల్స్ పబ్ కేసు(Jubilee Hills Pub Case)లో బీఆర్ఎస్ నాయకుడి కుమారుడే ఉన్నా పట్టించుకోలేదని తెలిపారు. ఒక మంత్రి కుమారుడు ప్రమేయం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయని సీఎం గుర్తుచేశారు. శాంతిభద్రతలపై దుష్ప్రచారం ద్వారా పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కుప్పకూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం దివాలా తీస్తే బీఆర్ఎస్ నేతలు సంతోషపడతారా? అధికార కాంక్షతో ఎలాంటి  దుష్ప్రచారమైనా చేస్తారా? ఈ 15 నెలల్లో శాంతిభద్రతలపైఎక్కడైనా రాజీపడ్డామా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు.

85 శాతం సొంత పన్నుల వసూల్లతో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడతారు? అని ప్రశ్నించారు. గతంలో జానారెడ్డి విపక్షనేతగా ప్రభుత్వానికి సహకరించారు. జానారెడ్డి(Kunduru Jana Reddy) నెలకొల్పిన సంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించరు? అన్నారు. ఎన్నికలు ఎప్పుడో 2029లోనే వస్తాయి.. మీరు కోరుకున్నంత మాత్రానా ఇప్పుడే రావన్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇద్దరు పోటీపడి దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి సూచించారు. ఆ ఇద్దరి పోటీతో మాకు తలనొప్పి వస్తోందని చెప్పారు. నేను పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు అందుబాటులో ఉంటానన్న సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే(Gajwel MLA) నా దగ్గరికి వచ్చిన మనస్ఫూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

పద్మరావు వచ్చారు.. కొన్ని నియోజకవర్గ పనులు అడిగారు.. అక్కడికక్కడే ఇచ్చేశామని తెలిపారు. ఫైనాల్సియల్ డిస్ట్రిక్ట్ ను విస్తరిస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్(Financial District)ను విస్తరించే ప్రయత్నం చేస్తే విద్యార్థులను రెచ్చగొడతారు. టీజీఐఐసీ ద్వారా పెట్టుబడులకు ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారు. భవిష్యత్తులో మీరు పరిశ్రమ కోసం భూములు సేకరించరా?, రాష్ట్రంలో పరిశ్రమలు.. పెట్టుబడులు రావద్దా? అని ప్రశ్నించారు. ఢిల్లీ రావుకు కట్టబెట్టిన భూమిని సుప్రీం కోర్టు పోరాడి సాధించామన్నారు. మా అత్తగారి ఊరని ఆమంగల్ కు రోడ్డు వేసుకుంటున్నానని హరీశ్ రావు(Thanneeru Harish Rao ) అంటున్నారు.. మా అత్తగారి కుటుంబం ఆ ఊరు విడిచిపెట్టి ఐదో దశాబ్దాలు దాటిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.