calender_icon.png 11 October, 2024 | 6:47 PM

Breaking News

కేసీఆర్ విద్య‎పై దృష్టి పెట్టలేదు! : సీఎం రేవంత్ రెడ్డి

11-10-2024 04:54:07 PM

రంగారెడ్డి,(విజయక్రాంతి): యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు శంకుస్థాపన జరుగుతున్నాయి. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అంధించటామే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందని,  గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. 

కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవటంతో టీచర్లలో అపనమ్మకం ఏర్పడిందని, ఈ ప్రబుత్వం 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ఒక నమ్మకం కలిగించింది. పేదల కోసం పాటుపడే అధికారులకు ప్రజల నుంచి, ప్రబుత్వం నుంచి అభినందన ఉంటాయన్నారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పాఠశాలలను పట్టించుకోలేదని, పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కుట్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ యొక్క దూరాలోచన అన్నారు. రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు ఆలోచన పీవీ నరసింహారావుది అని గుర్తు చేశారు.  రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదివిన చాలా మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అయ్యారు.

బుర్రా వెంకటేశం, మహేందర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. గత ప్రభుత్వం గరుకుల పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఏ గురుకుల పాఠశాలలకు సరైన భవనాలు, మౌలిక వసతులు లేవని సీఎం ఎద్దేవా చేశారు. 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఒక్కో స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు పడుతున్నారని, పేదలంతా గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ బావించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. చదువుకున్న విద్యార్థులకు కొలువుల గురించి కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. 

పేదలు తమ జీవితకాలమంతా కులవృత్తులు చేసుకుంటూ ఉండాల్సిందేనని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ.. ఇది పేదల ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సున్నా సీట్లు వచ్చినా.. వారి ఆలోచలన విధానం మారల్టేదు అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ మాత్రం 33 జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నారు. కానీ కేసీఆర్ పేద విద్యార్థులు చదువుకునేందుకు బడులు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు ఎక్కడా సరైన భవనాలు నిర్మించలేదన్నారు. చదువుకునే విద్యార్థులను కూడా కేసీఆర్ కులాల వారీగా విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ వేర్వేరుగా గురుకులాలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ప