calender_icon.png 1 April, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, చిత్రపటాలకు పాలాభిషేకం

30-03-2025 04:08:31 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో లంబాడా భాష, గోరు బోలి భాషను, రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చేందుకు, ఏకగ్రీవ తీర్మానం చేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో లంబాడా సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి సీతక్క(Minister Seethakka), ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి భాషను, ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

ఆదివారం తెలంగాణ చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆదివాసి చైర్మన్ బాణావత్ గోవింద్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు జాదవ్ వెంకట్రావు, బుఖ్య గోవింద నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, కడార్ల గంగ నరసయ్య, జరుపుల రాజేశ్వర్, రాము, గుగులావత్ రాజేందర్ నాయక్, బాణావత్ రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్, ప్రేమ్ దాస్ నాయక్, ప్రేమ్ సింగ్ నాయక్, రాము, బాపురావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.