calender_icon.png 20 September, 2024 | 12:09 PM

2029 ఎన్నికల నాటికి మెట్రో రైల్లో ఓల్డ్ సిటీలో తిరుగుతాం

27-07-2024 05:27:00 PM

పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు

పాతబస్తీ, ఎయిర్ పోర్టుకు కచ్చితంగా మెట్రో నిర్మిస్తాం

హైదరాబాద్: 2029 ఎన్నికల నాటికి మెట్రో రైల్ లో ఓల్డ్ సిటీలో తిరుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. తాము ఏం చెప్పామో అది చేసి తీరుతామన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తిచేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరిగా మాట తప్పమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా తెలిపారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

మెట్రో నిర్మాణంపై ఎల్అండ్ టీతో చర్చలు జరుపుతున్నామన్నారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్ పోర్టు వరకు గత ప్రభుత్వం 32 కిలో మీటర్ల వరకు మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచిందన్నారు. కేవలం స్థిరాస్తి సంస్థలకు మేలు చేసేందుకు ఆ మార్గంలో మెట్రో అన్నారని వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి ఎయిర్ పోర్టుకు మంచి రోడ్లు ఉన్నాయన్న సీఎం మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మించనుందన్నారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదగా మెట్రో నిర్మాణం చేపడతామని తెలిపారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు.