27-02-2025 01:01:33 PM
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. హెచ్సీఎల్ టెక్ నూతన క్యాంపస్(HCL Tech New Campus) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో నూతన హెచ్ సీఎల్ క్యాంపస్ ఏర్పాటు సంతోషకరమన్నారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని తెలిపారు. ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు సాధించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని(Telangana state) 1 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఈవీ, బయోటెక్ సహా తదితర రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని చెప్పారు. తెలంగాణ రైజింగ్(Telangana Rising) అవుతుందని చెపితే కొందరు నమ్మలేదన్న ముఖ్యమంత్రి దావోయిస్ పెట్టుబడులను చూసి నమ్ముతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు బెంగుళూరు, ముంబైతో పోటీ కాదు.. ప్రపంచంతోనే పోటీ పడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.