calender_icon.png 20 November, 2024 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టం అందరికీ సమానమే కేటీఆర్

20-11-2024 03:50:07 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తాం..

కేసీఆర్ కి లెక్కలు తీసి చూసిస్తాం

కేటీఆర్, హరీశ్ రావు మన కాళ్ల మధ్యలో కట్టెలు పెడుతున్నారు..

హరీశ్ రావు లెక్క చెప్పాలి.. అన్ని లెక్కలు తీయిస్తాం

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.. కేసీఆర్ వల్ల కాదా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రూ. 11 వేల కోట్ల రుణ మాఫీకి కేసీఆర్ ఐదేళ్లు తీసుకున్నారు. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేశామయని స్పష్టం చేశారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. పదేళ్లలో మీర చేయలేని పని తాము చేస్తుంటే మీకు నొప్పి ఎందుకన్నారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉంది.. త్వరలోనే పెడతారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తామని సీఎం హెచ్చరించారు. మీరు చేసిన రుణమాఫీ.. మేము చేసిన రుణమాఫీ వివరాలు బయటకు తీసి చర్చకు పెడదామని సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తామన్నారు.

అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం ఉద్యోగాలు వచ్చిన వారిని పిలుస్తాం.. లెక్కపెట్టుకోవాలని సూచించారు. కొత్తగా ఉద్యోగాలు వచ్చినవారు.. 50 వేల మంది కంటే తక్కువ ఉంటే క్షమాపణలు చెప్తానని సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది తెలంగాణలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించారు.. అది మా గొప్పతనం కాదా.. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పూర్తి చేస్తున్నామన్నారు. రూ. 1.83 వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఖర్చు పెట్టారు.. రంగ నాయక్ సాగర్ వద్ద హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీశ్ రావు పేరు మీదకు రాయించుకున్నారని సీఎం ఆరోపించారు. భూ బదలాయింపుపై హరీశ్ రావు లెక్క చెప్పాలి.. అన్ని లెక్కలు తీయిస్తామన్నారు. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వ ద్వారా నేరుగా నీళ్లు పోతున్నాయి. ప్రజలు అధికారం ఇస్తే ఇదేనా మీరు చేసేదని ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకున్నవారు ఇంట్లో దొరికితే కేసు పెట్టకూడదా..?, బావా తాగి తందనాలు ఆడితే కేటీఆర్ ఎలా సమర్థిస్తారు?, విదేశీ మద్యంతో దొరికితే కేసు పెట్టకూడదా?, చట్టం అందరికీ సమానమే కేటీఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.