13-03-2025 01:51:22 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారత్ సమ్మిట్(Bharat Summit) పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. ఈ సమ్మిట్ లో సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. బరాక్ ఒబామా(Barack Obama) వంటి వారు హాజరయ్యే అవకాశముందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ నిర్వహించాలంటే కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్(Center Political clearance) ఇవ్వాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ పైనే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్(External Affairs Minister Jaishankar) ను కలుస్తున్నానని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో 'మిస్ వరల్డ్' పోటీలు(Miss world competitions) జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. నెల రోజుల పాటు పోటీలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రెండు రోజుల్లో అధికారులతో ఒక కమిటీ నియమిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు గురువారం మధ్యామ్నం 3.30 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అధికారులతో భేటీ కానున్నారు.