calender_icon.png 29 April, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష

29-04-2025 03:03:13 PM

హైదరాబాద్‌,(విజయక్రాంతి): హైదరాబాద్ వేదిక నిర్వహించే మిస్ వరల్డ్ 2025 పోటీల సన్నాహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి మిస్ వరల్డ్ 2025 పోటీల సన్నాహాల పురోగతిని అంచనా వేయడానికి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే 10న ప్రారంభమై జాన్ 2వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగున్నాయి.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పోటీలకు వస్తున్న వారికి అసౌకర్యం లేకుండా చూడాలని, ఎయిర్ పోర్టు, హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చరిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉండాలని, అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లాజిస్టికల్, భద్రతా అంశాలపై దృష్టి సారించిన ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పోలీసులు సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.