12-02-2025 04:50:01 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నిర్వహణపై సమీక్షించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై చర్చించారు. రేషన్ కార్టులకు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రి సీతక్క కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.