calender_icon.png 26 January, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులకు లబ్ధి చేకూరిస్తే.. చర్యలు తప్పవు: సీఎం రేవంత్

25-01-2025 01:50:02 PM

హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Integrated Command and Control Center)లో అధికారులతో ప్రజాపాలన పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... రేపు రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Illu Housing Scheme ), రేషన్ కార్డు పంపిణీ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామన్ని ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియామిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 లోగా అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి అన్యాయం జరగవద్దని ఆదేశించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయ అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.