హైదరాబాద్: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై వివరాలను తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.