calender_icon.png 9 October, 2024 | 5:49 PM

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

09-10-2024 03:29:23 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీకోర్టు తీర్పు అమలు కోసం చర్యలు తీసుకోవాలని, కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.ఏస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏకసభ్య కమిషన్ కు సీఎం ఆదేశించారు. 

ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని, 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. గడువులోగా ఏకసభ్య కమిషన్ నివేదిక సమార్పించాల్సిందేనని స్పష్టం చేశారు.