calender_icon.png 11 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్ష

11-01-2025 02:37:35 PM

హైదరాబాద్: కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోషామహల్(Goshamahal)లో స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు జరగాల్సిఉంది. నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాపులను అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఆయన అందులో పలు మార్పులు, చేర్పులను చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలు రూపొందించాలని సూచించారు. రోడ్లు, పార్కింగ్,  మార్చురీ, మౌళిక సదుపాయాల విషయంలో అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు(CM Revanth Reddy Key Instructions) చేశారు. రాబోయే 50 ఏళ్లకు గానూ అవసరాలను అంచనా వేసి కొత్త ఆస్పత్రిని నిర్మించాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.