హైదరాబాద్: సాగునీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , కొండా సురేఖ సమీక్షకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేప్టీ అథారిటీ నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు.
అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో భేటీ అయ్యారు. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కురుస్తున్న భారీ వర్షాలు, రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు సీఎంను కోరారు. దానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.