హైదరాబాద్: పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆరా తీశారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి తరదిత జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటు, భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ ఆదేశించారు. ఇబ్బందులు వస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిపై సిఎం విచారం వ్యక్తం చేశారు. పిడుగు పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపడి గాయపడిన ఐదుగురికి వైద్యం అందించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.