calender_icon.png 3 October, 2024 | 10:55 PM

ప్రజలు బాధల్లో ఉంటే ప్రతిపక్షనేత ఎక్కడ ఉన్నారు

03-09-2024 03:57:06 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా  కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. ఈ వర్షాలతో జిల్లాలో విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్షం తగ్గినందున తక్షణవే బుద తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించుకోవచ్చారు. ఎంత ఒత్తిడి వచ్చిన హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నామని, ప్రకృతి ప్రకోపిస్తే ఏమి జరగుతుందో మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నామని ఆయన వెల్లడించారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం, కార్యాచరణను సిద్ధం చేస్తుందని ఆయన తెలిపారు.

ఆక్రమణలకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, పేదల ప్రాణాలు పోయాక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదన్నారు. పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్ రావు డిమాండ్ చేయగలరా..? అని ప్రశ్నించారు. చెరువులను ఆక్రమించిన వారు ఎంతటివారైనా తొలగించాలన్నారు. ఆక్రమాణలు తొలగించేందుకు విధివిధానాలు రూపొందించాలని, గతంలో మానవత్వం లేని వ్యక్తి పదేళ్లు పాలన చేశారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితులను ఆదుకుంటున్నామన్నారు. ఇక్కడ ప్రజలు బాధల్లో ఉంటే ప్రతిపక్షనేత ఎక్కడ ఉన్నారని, ఆయన కుమారుడు అమెరికాలో జల్సాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదని, ధైర్యంతో ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.