calender_icon.png 20 November, 2024 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

03-09-2024 03:22:04 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు జలమయమైన్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. దీంతో  దాదాపు 30వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని సీఎం పేర్కొన్నారు.

ఎన్ని చర్యలు చేపట్టినా కొంత ప్రాణనష్టం, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం చాలా బాధకరంగా ఉందని దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. దీనిపై సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నామని, మహబూబాబాద్ లో నలుగురు మృతి చెందాడం చాలా బాధాకరంగా ఉందన్నారు. సహయచర్యల్లో రెవెన్యూ పోలీసులు నిరంతరం పనిచేశారని, ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగాం అని, ఈ వరదలతో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం అందిజేస్తామని చెప్పారు. ఇళ్లు నష్టపోయిన మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం తెలిపారు. కేంద్రానికి నివేదించడానికి నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించి తక్షణ సహాయం కింద రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రాణ, ఆస్తినష్టం పరిశీలనకు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.