calender_icon.png 26 October, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు: సీఎం రేవంత్

12-07-2024 05:04:46 PM

హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధివిధానాలపై అధికారులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు. ఓఆర్ఆర్ వరకు 2వేల చ.కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించాలని సీఎం సూచించారు.

హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలన్నారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సూచించారు. ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.