హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్న సీఎం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోకా మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.