హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.
జాతీయరహదారుల స్థితిగతులు, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంచిర్యాల - వరంగల్ - ఖమ్మం - విజయవాడ కారిడార్ భూసేకరణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెలాఖారులోగా సమర్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.