calender_icon.png 28 October, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి

07-07-2024 09:33:28 PM

హైదరాబాద్ : గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను అందుబాటులోకి తెసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 6 సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టామని, గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులపై ఆరా తీశారు.

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకోచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం గోదవరి బేసిన్ లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజీ-2, సదర్మట్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ప్రాజెక్టుల పూర్తికి రూ.241 కోట్లు ఖర్చవుతుందని అచనాలు చేసిన నీటిపారుదల శాఖ 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపింది. 2025 మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో నిర్మల్, ఆదిలాబాద్, సూర్యపేట, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టుకు నీరు అందుతుందని సీఎం వెల్లడించారు.