calender_icon.png 27 December, 2024 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టగా.. యాదాద్రి

08-11-2024 03:18:21 PM

యాదాద్రి: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలయ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా పేరు మార్పు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని రేవంత్ రెడ్డి సూచించారు. గోసంరక్షణకు సాంకేతిక పరిజ్జానం వినియోగించాలని చెప్పారు. కొండపై భక్తులు నిద్రపోయేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.