calender_icon.png 30 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహాచలం ఘ‌ట‌న‌పై స్పందించిన తెలంగాణ సీఎం

30-04-2025 11:41:13 AM

హైదరాబాద్: సింహాచలంలో(Simhachalam Temple) ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం(Simhachalam Temple Tragedy) వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎక్స్ లో పోస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో ఉన్న ప్రసిద్ధ అప్పన్న స్వామి ఆలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున గోడ కూలి(Simhachalam Temple Wall collapses) ఐదుగురు మహిళలు సహా కనీసం ఏడుగురు భక్తులు మరణించగా, డజను మంది గాయపడ్డారని నివేదికలు తెలిపాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రూ. 300 టికెట్ కౌంటర్ పక్కన ఉన్న సిమెంట్ గోడ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆలయంలో ‘చందనోత్సవం’ పండుగ దృష్ట్యా ఆలయం వద్ద భారీ రద్దీ నెలకొంది. వార్షిక ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యూ లైన్లు చాలా దూరం వరకు విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత(Andhra Pradesh Home Minister Anithaప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గోడ ఎవరి హయంలో కట్టారో.. కాంట్రాక్టర్‌ ఎవరో అన్ని విషయాలపై విచారణ జరుపుతామని చెప్పారు. కూలిన గోడ నాణ్యతపై విచారణ జరిపిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.