calender_icon.png 11 February, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజారి రంగరాజన్‌పై దాడి.. స్పందించిన సీఎం

10-02-2025 06:35:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహించారు. రంగరాజన్ కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూజరి దాడిపై స్పందించారు. అర్చక వృతిలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అమానుషమని ఆయన మండిపడ్డారు. ఈ ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు.