calender_icon.png 3 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఇప్పటికే.. చంచల్‌గూడ జైల్లో ఉంటుండే: సీఎం రేవంత్

27-03-2025 03:57:46 PM

హైదరాబాద్: మేం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే.. చంచల్ గూడ జైలులో ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం మాట్లాడుతూ...  అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ. 500 జరిమానా విధిస్తారు. ఒక ఎంపీ మీద డ్రోన్ ఎగరవేశారని కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్ పై వచ్చి వెళ్లానని సీఎం(Revanth Reddy) తెలిపారు. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందురు జైలులో ఉండేవారని చెప్పారు. కేటీఆర్, కేసీఆర్ కు జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇస్తానని అన్నాను.. కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్ష రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. కేటీఆర్, కేసీఆర్ జైలులో వేయాలని చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎస్ మొదటి విడత ప్రభుత్వం కేవలం రూ. 13 వేల కోట్లు రుణమాఫీ చేసిందని సీఎం తెలిపారు. తొలి విడత రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారు. రెండో సారి గెలిచాక రుణమాఫీ అసలు పూర్తే చేయలేదని ఆరోపించారు.

నాలుగేళ్ల తర్వాత మాత్రం రూ. 11 వేల కోట్ల రుణమాఫీ చేశారని సీఎం స్పష్టం చేశారు. నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ చేసినందుకు వాటికి వడ్డీ రూ. 8500 కోట్లు పైగా అయిందన్నారు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకని రైతుబంధు కూడా వేయలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎగవేసిన రైతుబంధు రూ. 7625 కోట్లు మేం చెల్లించామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. వరి వస్తే ఉరే అని స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బెదిరించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మేం మాత్రం వరి వేసిన వారికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశాం.. గత ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులు మేం పది నెలల్లో చేశామని సీఎం రేవంత్ తెలిపారు.

వడగళ్ల వానతో పంట నష్టం జరిగితే గత ప్రభుత్వం ఏనాడు పరిహారం చెల్లించలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్ర అప్పు(Debts of Telangana) రూ. 72 వేల కోట్లు. కార్పోరేషన్ అప్పు కూడా కలిపితే రూ .90 వేల కోట్లు అప్పు. ఈ పదేళ్లలో ఎఫ్ఆర్ బీఎం అప్పులే రూ. 3.50 లక్షల కోట్లు దాటిందని లెక్క చెప్పారు. మాకు అధికారం అప్పగించేనాటికి ఉన్న అప్పు రూ. 6.69 లక్షల కోట్లు, పెండింగ్ బిల్లులే రూ. 40 వేల కోట్లు పెట్టిపోయారన్నారు. కేసీఆర్ దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే రూ. 8.19 లక్షల కోట్లు అప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేం 15 నెలల్లో రూ. 1.58 లక్షల కోట్లు అప్పు చేశామన్న ముఖ్యంత్రి కొత్తగా చేసిన అప్పుల్లో రూ. 1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామని తెలిపారు. కూలిపోయిన కాళేశ్వరానికి కూడా రూ. 5 వేల కోట్లకు పైగా చెల్లిమని సీఎం వెల్లడించారు.