calender_icon.png 30 September, 2024 | 4:04 PM

దసరా పండగలోపు ఉపాధ్యాయ నియామకాలు

30-09-2024 01:23:01 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు 2024 సోమవారం విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం 56 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు ఇచ్చామని పేర్కొన్నారు. 1:3 నిష్పత్రిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు.

 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. దసరా పండగ లోపు ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని ఆయన చెప్పారు. అంతలోపు సర్టిఫికేట్ల వెరిఫికేన్‌ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్‌ 9న ఎల్డీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. పదేళ్లలో గత ప్రభుత్వం 7 వేల పోస్టులతో  ఒకే నోటిఫికేషన్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఎస్ పీఎస్ సీని ప్రక్షాళన చేశామని చెప్పారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పాఠశాలల ఫీజుల నియంత్రణపై త్వరలోనే కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సచివాలయంలో డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి, నామా, కొండ సురేఖ, సీఎస్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.