calender_icon.png 22 February, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. కీలక ఆదేశాలు జారీ

22-02-2025 12:43:40 PM

హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌(SLBC tunnel collapse) వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట వెనుక ఉన్న ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో ఒక భాగం శనివారం ఉదయం కుప్పకూలింది. ఎడమ వైపు సొరంగం పైకప్పు 14వ కిలోమీటరు మార్క్ వద్ద మూడు మీటర్ల పొడవు మేర పైకప్పు పడింది. పైకప్పు కూలి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. మార్నింగ్ షిఫ్టులో సొరంగంలో 40 మంది కార్మికులు పనులకు వెళ్లారు. సొరంగంలోని రింగులు కిందపడి ప్రమాదం, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సొరంగం నుంచి ఒక్కక్కరిగా కార్మికులు బయటకు వస్తున్నారు.