calender_icon.png 21 April, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపూర్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

12-12-2024 01:56:33 AM

* ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన రాజస్థాన్ పీసీసీ చీఫ్,  సీఎల్పీ నేత 

* నేడు, రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రి పర్యటన

* పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ స్థాన్ రాష్ట్రం జైపూర్‌కు బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా జైపూర్ ఏయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్‌చరణ్ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం  సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్స్‌పై చర్చించనున్నారు.

ఇక పార్టీ పెద్దలతో భేటీలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలను చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్‌గౌడ్, పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా సీఎం రేవంత్‌రెడ్డి, 11 మంది మంత్రులే ప్రమాణస్వీకారం చేయగా.. మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నది. గతేడాది నుంచి వివిధ కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.

నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా మొ దటి విడతలో 36 మందికి అవకాశం ఇవ్వ గా.. రెండో విడత కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.