calender_icon.png 24 January, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

24-01-2025 10:15:26 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్(CM Revanth Reddy Davos Tour) పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన సింగపూర్, దావోస్ పర్యటనలు రెండింటినీ విజయవంతం చేసి, రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులను సాధించారని వారు ప్రశంసించారు. దావోస్ పర్యటన సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రూ.1,78,950 కోట్ల విలువైన పెట్టుబడులను పొందేందుకు పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మునుపటి పర్యటనలో వచ్చిన రూ.40,232 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. గత దావోస్ పర్యటనతో పోలిస్తే నాలుగురెట్లు పెట్టుబడులు పెరిగాయి. ఈ కొత్త పెట్టుబడులతో దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మొత్తం 20 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం(Telangana Rising) దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) పర్యటనను ముగించింది. రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 49,550 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), సీనియర్ బ్యూరోక్రాట్‌లతో కలిసి రేవంత్ రెడ్డి, తెలంగాణను పరిగణనలోకి తీసుకునేలా ప్రపంచ దేశాలను ఒప్పించడంలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) విడుదల చేసిన ప్రకారం.. అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడులలో అమెజాన్(Amazon) రూ.60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ రూ.45,500 కోట్లు, టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, రూ,15,000 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయి.