అమిస్తాపూర్ : మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం అమిస్తాపూర్ కు చేరుకున్నారు. రైతు పండుగ సభ వద్దకు సీఎం చేరుకున్నారు. వేదిక వద్ద స్టాళ్లను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరిశీలించారు. ప్రజావిజయోత్సవాల్లో భాగంగా 'రైతుపండుగ' ముగింపు వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రుణమాఫీ కింద 3 లక్షల మంది రైతులకు రూ. 3 వేల కోట్లును ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏడాది పాలనపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానమివ్వనున్నారు.