25-03-2025 10:40:00 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామాన్ని మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించినందుకు మున్నూరు కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావుకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జుక్కల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మున్సిపాలిటీ లేదని, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు దెర్పల్ సంతోష్, పట్టణ అధ్యక్షులు సాయిని అశోక్, సోపన్ సార్, దడ్ది నాగ్నాథ్, దెర్పల్ గంగాధర్, గడ్డం అరవింద్ సార్, కొట్టంకాడి పండరి, హాజీ బాల్రాజ్, సాయిని బస్వరాజ్, బాలకృష్ణ, పోతుల అనిల్ స్వామి మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.