11-03-2025 03:04:55 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Acharya Konda Laxman Bapuji) నామకరణం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించడంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో పద్మశాలి గా జన్మించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వైద్య కళాశాలకు పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవులను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం వచ్చేదాకా పోటీ చేయనని ప్రకటించిన మహానీయుడని కొనియాడారు. రాష్ట్ర సాధన లో భాగంగా తన నివాసాన్ని సైతం వేదికగా అందజేశారని గుర్తు చేశారు. బాపూజీ పేరును కళాశాలకు పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. వాంకిడి మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవాసదన్ సంస్థ చెందిన భూమిలో ఆయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందుకు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ రూ.30 లక్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు.
పద్మశాలీల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్ల కనకయ్య, గుండా శంకర్, ఆసిఫాబాద్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల శ్రీకాంత్, అల్లె శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు కోమటిపల్లి లింగయ్య,మహిళా అధ్యక్ష ,కార్యదర్శులు జంజిరాల పుష్పలత, చెన్నూరి సునీత, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నగోసే శంకర్, పద్మశాలి సంఘం సీనియర్ నాయకురాలు ఇరుకుల్ల మంగ, ఆవిడపు ప్రణయ్, సిరిపురం భద్రయ్య, గుండా శ్యామ్, గాజర్ల శైలేందర్, చిప్ప సురేష్ , భోగ మధుకర్,తేలివార్ మోహన్, జంజిరాల శ్రీనివాస్, వనమాల ధర్మయ్య, పొన్న రామ్ చందర్,పొన్న తిరుపతి, పసుపునూరి తిరుపతి, కోమటిపెల్లి ఏసయ్య, కొలిపాక సత్యనారాయణ, చిప్ప మహేష్, బుదారపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.