హైదరాబాద్: ఢిల్లీలో పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు గాను కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy)కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆర్ఆర్ఆర్ నార్త్ టెండర్ ప్రక్రియ ప్రారంభంపై కోమటిరెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టును ఏడాదిలోపే ప్రారంభించడంలో మీ సహకారం, కృషితోనే సాధ్యమైందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.