calender_icon.png 4 March, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

09-12-2024 06:50:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. చేతిలో వరి, జోన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గేయం రచయిత అందెశ్రీని, తెలంగాణ తల్లి విగ్రహాం రూపకర్త గంగాధర్ ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. విగ్రహావిష్కరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.