calender_icon.png 12 January, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసాగర్ రావు అనుభవం తెలంగాణకు అవసరం

12-01-2025 02:05:07 PM

 నాకు భేషజాలు లేవు.. ఎవరి సలహాలనైనా స్వీకరిస్తా

హైదరాబాద్: మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఆత్మకథ ఉనిక పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఉనిక పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(chief minister revanth reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... విద్యాసాగర్ రావు(Vidyasagar Rao) ఎక్కడ ఏ హోదాలో ఉన్నా.. మాకు మాత్రం సాగర్ జీనే.. విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా గవర్నర్ గా సేవలందించారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే నాయకుడు.. విద్యాసాగర్ రావు అన్నారు. విద్యార్థి రాజకీయల నుంచి విద్యాసాగర్ రావు ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొకుండా ప్రజాజీవితంలో విద్యాసాగర్ రావు ఉన్నారు. వ్యక్తిగత ఆరోపణలు లేకుండా తెలంగాణ సమాజానికి ఆదర్శంగా ఉన్నారని తెలిపారు.

ఒక్కప్పుడు అధికారపార్టీప్రతిపక్షం మధ్య సంబంధాలు బాగుండే

ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిందే శాసనసభ.. ప్రతిపక్షానికి, విపక్షానికి స్పష్టమైన విధులను రాజ్యాంగం నిర్దేశించిందని సీఎం పేర్కొన్నారు. ఒక్కప్పుడు అధికారపార్టీ, ప్రతిపక్షం మధ్య సంబంధాలు బాగుండేవని గుర్తుచేశారు. ప్రతిపక్షం నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి కావాల్సినంత సమయం ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షం వారిని సభ నుంచి ఎప్పుడూ బహిష్కరించలేదని వెల్లడించారు. విమర్శలు, నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఇస్తున్నామని సూచించారు. విద్యాసాగర్ రావు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ముఖ్యమంత్రి వెల్లడించారు. తనకు భేషజాలు లేవు.. ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని చెప్పారు. విపక్ష నేతలు అయినా సరే.. అవసరం ఉన్న చోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

 కేంద్రం సహకరిస్తేనే.. రాష్ట్రాల అభివృద్ధి

మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi)ని కోరారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సహకరిస్తేనే.. రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణం అవుతుందన్నారు. హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) నేడు 9వ స్థానానానికి పడిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయని ముఖ్యమంత్రి సూచించారు. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు.. ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జనాభా అంత ఉన్న దేశం ఒలింపిక్స్ లో 30 పతకాలు సాధించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.