calender_icon.png 19 March, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేదు: సీఎం కీలక వ్యాఖ్యలు

19-03-2025 03:02:58 PM

ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం.

నేను ఉన్నప్పుడే ఎస్సీ వర్గాలకు న్యాయం.

ఎస్సీ వర్గీకరణ కొలిక్కి వచ్చే వరకు నోటిఫికేషన్ ఇవ్వని చెప్పా.

ఎస్సీ వర్గీకరణలో 15శాతం రిజర్వేషన్ల కేటాయింపు.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీల్లో ఏ గ్రూప్ లో ఎవరెవరు ఉండాలనేది విశ్లేషించారని చెప్పారు. అతి తక్కువ జనాభా కలిగి.. అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిలో గ్రూప్-1లో ఉంచామని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ తీర్మాణం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీలో చెప్పానని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ(Classification of SC)పై కేంద్రానికి తీర్మానం పంపాలని సావధాన తీర్మానం పెట్టామని చెప్పారు. తీర్మానం పెడితే నాతో పాటు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ ను సభలో నుంచి బహిష్కరించారని సీఎం తెలిపారు.

తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో ఆనాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చిందని వెల్లడించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానని  గతంలో ఏనాడు తీసుకెళ్లలేదు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామని చెప్పారు. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసుల్లో బలంగా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించామని రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికీ ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదని సీఎం స్పష్టం చేశారు. మందకృష్ణ(Manda Krishna Madiga)తో ఎలాంటి విభేదాలు లేదు.. వ్యక్తిగత అనుబంధం బాగుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మందకృష్ణ నా కంటే కిషన్ రెడ్డి(Kishan Reddy), మోదీని  ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పారు. బీజేపీ(Bharatiya Janata Party) ప్రభుత్వాలు ఉన్నచోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని సీఎం ఆరోపించారు. ఎస్సీ వర్గాలకు నేను ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మాను అని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. సమన్వయం చేసుకుంటూ శాసనసభలో అందిరినీ కూడగట్టామన్నారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదు.. ఎస్సీ వర్గీకరణ కొలిక్కి వచ్చే వరకు నోటిఫికేషన్ ఇవ్వనని చెప్పానని వ్యాఖ్యానించారు. చెప్పిన మాట ప్రకారమే నాటి నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డికి దళిత సంఘాలు అభినందనలు తెలిపాయి. సీఎంకు మాదిగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు