calender_icon.png 31 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యపై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్తుపై పెట్టుబడి

31-01-2025 06:02:33 PM

మొగిలిగిద్దలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హాజరయ్యారు. మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మొగిలిగిద్ద పాఠశాలలోనే దివంగత గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, మర్రి చెన్నారెడ్డి చదువుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మొగిలిగిద్ద లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(Advance Technology Center) మంజూరు చేస్తున్నాని చెప్పారు. ఎందరో ప్రముఖులు మొగిలిగిద్ద పాఠశాలలో చదివారని సీఎం గుర్తచేశారు. మొగిలిగిద్ద పాఠశాల(Mogiligidda ZPHS school)ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. గత ప్రభుత్వం మొగిలి గిద్ద పాఠశాలను పట్టించుకోలేదని సీఎం(Revanth Reddy) ఆరోపించారు. మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వాలని ఆదేశించానని వెల్లడించారు. మొగిలిగిద్దకు సుమారు రూ. 16 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు(Teacher Appointments) జరగలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం రాగానే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల తరబడి నియామక ప్రక్రియ జరిగేదని ఆయన విమర్శించారు. మా ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్లక్ష్యం చేసిందన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) హయాంలో వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని ద్వజమెత్తారు. మా ప్రభుత్వం రాగానే వీసీలను నియమించామన్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచామని పేర్కొన్నారు.

విద్యపై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్ పై పెట్టుబడి అన్నారు. విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకుని నిత్యం పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచలేదని, తాము వచ్చాక డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచాలని యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(Young India Skill University)ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా.. బంగారు పథకం సాధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాకొరియాలో కోటి మంది ఉన్నా.. 32 బంగారు పథకాలు సాధించారని కొనియాడారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పథకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. గతంలో సమాజ సమస్యలను సైతం వర్సిటీ విద్యార్థులు పరిష్కరించేవారు.. ప్రస్తుతం వర్సిటీలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయని సీఎం తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.