calender_icon.png 15 November, 2024 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెజారిటీ, మైనారిటీ.. ప్రభుత్వానికి రెండు కళ్లు

11-11-2024 01:28:56 PM

దేశంలో 2 వర్గాలే ఉన్నాయి..

ఒకటి మోడీ వర్గం.. మరొకటి గాంధీ వర్గం

హిందు, ముస్లి భాయి.. భాయి అన్నదే కాంగ్రెస్ విధానం

మహారాష్ట్రలోని మీ బంధు, మిత్రులతో చెప్పండి

హైదరాబాద్: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ విద్య దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు, సామాజిక వేత్తలకు ముఖ్యమంత్రి అవార్డులు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెజారిటీ, మైనారిటీ.. ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు. దేశంలో 2 వర్గాలే ఉన్నాయి.. ఒకటి మోడీ వర్గం.. మరొకటి గాంధీ వర్గం అన్నారు. స్వాతంత్య్రం రాగానే మౌలానా అబుల్ కలామ్ ను నెహ్రూ విద్యాశాఖ మంత్రిని చేశారని సీఎం గుర్తుచేశారు. విద్యావ్యవస్థలో మౌలానా అబుల్ కలామ్ అనేక విధానాలు తెచ్చారని పేర్కొన్నారు.

హిందు, ముస్లిం భాయి భాయి అన్నదే కాంగ్రెస్ విధానం అన్నారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారని వెల్లడించారు. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనార్టీలకు ఇచ్చాం.. మైనారిటీలకు ఈ ప్రభుత్వం అనేక పదవులు ఇచ్చిందని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోడీ ఎందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మత విద్వేశాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలని సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మహారాష్ట్రలోని మీ బంధు, మిత్రులకు చెప్పండని కోరారు.