calender_icon.png 26 December, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనపై విపక్షాలు తప్పుడు ప్రచారం

04-12-2024 07:38:15 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహిస్తున్న యువ వికాసం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతోనే సమాన్యుడినైన తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మొదట పెద్దపల్లి గడ్డపైనుంచే చెప్పారని గుర్తు చేశారు. ఎన్ని అవాంతారాలు వచ్చినా సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సీఎం పేర్కొన్నారు. కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాది ఉద్యోగాల కోసమే అని, మొదట ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉద్యమం మొదలైందన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా రాజ్యం రాష్ట్రంగా మారిందని ఆయన చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఐటీ పరిశ్రమశాఖ మంత్రి శ్రీధర్ బాబు తామను బెదిరించి రూ.100 కోట్ల పనులు పూర్తి చేయించుకున్నట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పదేళ్ల పాలనను ఏడాది పాలనను పోల్చి చూసి ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రజలను కోరారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ లో సీఎం, పీఎంగా ఉంటూ ఒక్క ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా..? ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నియామక పత్రాలు ఇచ్చామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు. కోటి మంది ఆడబిడ్డలు ఓటేస్తే మళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. శాతవాహన వర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

రాష్ట్రంలోనే అత్యధికంగా వడ్లు పండిస్తున్న జిల్లా పెద్దపల్లి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒక్కరోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా..?, ప్రభుత్వంలో ఏ పని చేయాలన్న విధివిధానాలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల పాలించారు.. పది నెలలైనా ఆగలేరా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ శాసన సభకు వచ్చి తన మేధావితనాన్ని ప్రజలకు పంచాలని, ఎకరంలో రూ.కోటి పంట ఎలా పండించారో కేసీఆర్ రైతులకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్నందుకు కేటీఆర్ తామను అభినందిస్తే ఆయన కిరీటం ఏమీ కిందపడదు అని మండిపడ్డారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనట్లేదని, వారేమైన బీసీ వ్యతిరేకులా..? అని ప్రశ్నించారు.