calender_icon.png 24 February, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్‌ను ఓడించండి చూద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

24-02-2025 05:34:55 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణలో జరుగనున్న ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ను ఓడించండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను ఓడించి పట్టభద్రులకు ఏం సమాధానం చెబుతారని బీఆర్ఎస్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఏం ఒప్పందం జరిగింది..? అని, కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు ఏం తెచ్చారని అడిగారు. 11 ఏళ్లలో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ నిర్వహించామని చెప్పారు. 11 వేల టీచర్ ఉద్యోగాలు నియమించింది కాంగ్రెస్ సర్కారు కాదా..?, రాష్ట్రంలో 55,163 మందికి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ఇద్దరికే ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. వందేళ్లలో దేశంలో బీసీ కులగణన జరిగిందా..?, 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఎందుకు కులగణన చేయలేదన్నారు. మార్చి 31లోగా రైతులకు భరోసా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. గొర్రెల స్కామ్ కేసు, పార్ములా ఈ-కారు రేసింగ్ కేసు పెడితే ఈడీ పేపర్లన్ని తెసుకెళ్లిందని, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అడ్డంపెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును ఇండియాకు ఎందుకు రప్పించట్లేదు..? అని ప్రశ్నించారు. ముందు శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించండి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చేయాలో మేం చేస్తామని సవాల్ చేశారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అడ్డంగా పడుకుంటున్నారని, కిషన్ రెడ్డి, ఈటల కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. హైటెక్ సిటీ కట్టింది తామే అని, ఫ్యూచర్ సిటీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వామే అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.