హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్(Aramghar-Zoo Park Flyover)ను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. 4 కిలో మీటర్ల పొడువుగా 6 వరుసల్లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ నిర్మించారు. పీవీ ఎక్స్ ప్రెస్ వే(PV Narasimha Rao Expressway) తర్వాత నగరంలో రెండో అతిపెద్ద పై వంతెన ఇదే. ఎస్ఆర్ డీపీలో భాగంగా రూ. 799 కోట్లతో పైవంతెనను నిర్మించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.