calender_icon.png 7 January, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాలివ్వడంలో తెలంగాణది దేశంలోనే రికార్డు: సీఎం

05-01-2025 12:11:59 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిషత్తు కోసమే

హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందనే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో ఆదివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhayahastam) కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన 20 మందికి ఆర్థిక సాయం చేశారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థుల(Civil candidates)కు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రగతి భవన్ ప్రజాభవన్‌గా ఏర్పడిందన్నారు.

సివిల్స్ అభ్యర్థులు టాప్ ర్యాంకులో వచ్చి తెలంగాణకు సేవలు అందిస్తే బాగుంటుందని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే రికార్డని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లలో పేరుకుపోయిన ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం.. ఏ ఏడాది ఇన్ని ఉద్యోగాలివ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వడంతో  తెలంగాణ(Telangana) దేశంలోనే రికార్డు అన్నారు. గత 14 ఏళ్లలో గ్రూప్-1 నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. గతంలో ఎన్నడూ 563 గ్రూప్ -1 ఉద్యోగాలు(Group-1 Jobs) ఇవ్వలేదని విమర్శించారు. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేశారని ద్వజమెత్తారు. గ్రూప్ 1 పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మార్చి 31 లోపు గ్రూప్ వన్ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. గ్రూప్ -1 విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఆలోచించేది యువత భవిష్యత్తు కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.