calender_icon.png 5 November, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయులకు గౌరవం లేదు

02-08-2024 04:42:41 PM

తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని అడిగితే.. ఎల్బీ స్టేడియంలో అని చెప్పిన

ఉపాధ్యాయుల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు 

హైదరాబాద్: పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... కోదండరామ్ కు విజ్ఞప్తి చేసి ఆత్మీయ సమ్మేళం ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాడడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కలవాలని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని అడిగితే.. ఎల్బీ స్టేడియంలోని ఉందని చెప్పానని సీఎం వెల్లడించారు. వేలాది మంది ఉపాధ్యాయుల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉందని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఇచ్చారని సీఎం తెలిపారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు పోషించిన పాత్ర మరవలేనిదని తెలిపారు. రాష్ట్రం సాధించుకున్నాక ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందని అనుకున్నాం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయులకు గౌరవం లేదని రేవంత్ రెడ్డిఆరోపించారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఏవిధంగా అవమానించిందో అందరూ చూశారని ముఖ్యమంత్రి వెల్లడించారు.