calender_icon.png 12 December, 2024 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

12-12-2024 05:20:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరిన సీఎం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ పలు కేంద్ర మంత్రులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.  సాయంత్రం 5.30 గంటలకి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సీఎం భేటీ కానున్నారు. రాత్రి 7.30 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.